తిరుపతి,తుడా,శ్రీకాళహస్తి, అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహిచిన జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి


తిరుపతి, ఏప్రిల్ 28: జిల్లాలో పరిష్కరించాల్సిన పలు సమస్యలపై తుడా, తిరుపతి, శ్రీ కాళహస్తి అధికారులతో పలు అంశాలపై జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సమీక్ష నిర్వహించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ జె.సి బాలాజీ తో కలసి తుడా వి.సి హరికృష్ణ, డి.ఆర్.ఓ శ్రీనివాస రావు, తిరుపతి ఆర్.డి.ఓ కనక నరసారెడ్డి,శ్రీ కాళహస్తి ఆర్.డి.ఓ హరిత, తదితరులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శెట్టి పల్లి భూములకు సంబంధించి జె.సి పరిశీలించాలని, గాజుల మండ్యం ఫ్యాక్టరీకి సంబందించి స్థానికుల అభిప్రాయాల సేకరణ మేరకు చర్యలు చేపట్టాలని పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి పర్యటనలో అందిన వినతుల పరిష్కారం పై దృష్టి పెట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.Source link

Leave a Reply

Your email address will not be published.